శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం శైవ క్షేత్రంలో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆదివారం ఇబ్బందులు తప్పలేదు. దేవాదాయ శాఖ అధికారులు ముందస్తుగా క్యూ లైన్ల ఏర్పాటు చేయకపోవడంతో ఆర్ అండ్ బి రోడ్డుపైనే ఎండలో నిరీక్షించాల్సి వచ్చిందని పలువురు భక్తులు వాపోయారు. రోడ్డుపై నిలుచున్న భక్తులకు త్రాగునీటి సదుపాయం కూడా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.