SKLM: AIYF 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్ అన్నారు. మంగళవారం ఆముదాలవలస స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద AIYF 17వ జాతీయ మహాసభలు గోడ పత్రికను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. అత్యధిక జనాభా కలిగిన దేశం మనదని అయితే దేశంలో 65శాతం యువత ఉందని యువశక్తిని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు.