BPT: పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం కార్యాలయంలో బుధవారం ప్రమాణ స్వీకారం జరిగింది. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఛైర్మన్గా మిండా శివ పార్వతి కిషోర్, సభ్యులుగా ఇనుముల శ్రీనివాసరావు, సామ్యూల్ ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకు సేవ చేయాలని ఎమ్మెల్యే సూచించారు.