BPT: భట్టిప్రోలు మండలంలోని మార్కెట్ యార్డ్లో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రజల నుంచి వచ్చిన వివిధ అర్జీలు, ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.