NLR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత, రాష్ట్ర మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమాన్ని బుధవారం చేజర్ల మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలు టపాసులు పేల్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.