ATP: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి రేపు యాడికిలో ‘మన యాడికి పరిశుభ్రత-మనందరి బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం నుంచి జేసీబీలు, ట్రాక్టర్లతో పట్టణంలోని పురవీధులు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను, కాలువలను క్లీన్ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమంలో నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం పిలుపునిచ్చింది.