సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏడు మంది ఆశ వర్కర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కలిసి పత్రాలు అందించారు. నూతనంగా నియమితులైన ఆశ వర్కర్లు సేవాభావంతో పని చేయాలని నాయకులు సూచించారు.