ELR: చింతలపూడి నగర పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు (ఏఐటీయూసీ, సీఐటీయూ అనుబంధం) మంగళవారం మెరుపు సమ్మె ప్రారంభించి, పనులను నిలిపివేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా పెంచిన జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అమలు అవుతున్నట్లుగా తమను ఆప్కాస్‌లో చేర్చాలని, నెలకు రూ. 21,000 జీతం చెల్లించాలన్నారు.