అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని మాసాపేట బ్రిడ్జి వద్ద ఉన్న పూలే విగ్రహానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పూలే కులవివక్ష వ్యతిరేక ఉద్యమకారుడని, మహిళా విద్యా ప్రోత్సాహకుడన్నారు. అణగారిన వర్గాల సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి కొనియాడారు.