కడప నగర శివార్లలోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 30 నుంచి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు టైలరింగ్ (31 రోజులు), బ్యూటీ పార్లర్ (35 రోజులు) అంశాలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ తెలిపారు. 18 నుంచి 50 సంవత్సరాలలోపు వయసు కలిగిన మహిళలు అర్హులని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులు, గృహిణీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.