ASR: మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చింతపల్లి మండలం తెరపల్లి గ్రామంలో కాఫీ తోటలు బాగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు గ్రామానికి చెందిన పలువురు గిరిజన రైతులకు చెందిన కాఫీ తోటలు, నీడ కోసం పెంచిన భారీ సిల్వర్ వృక్షాలు, మిరియాల పాదులు విరిగిపడ్డాయని తెలిపారు. దీంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.