శ్రీకాకుళం: క్రీడలతోనే మానసిక ఉల్లాసం సాధ్యమని ఐటీడీఏ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జన జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో భాగంగా ఐటీడీఎలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పివో మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడలు అవసరమే అని విద్యార్థులకు సూచించాడు.