NLR: ఉదయగిరి డిపో నుంచి అరుణాచలం గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సును గురువారం ఆర్టీసీ సిబ్బంది లాంఛనంగా ప్రారంభించారు. 94746 నెంబర్ గల ఈ సర్వీసు ఉదయగిరి నుంచి దుత్తలూరు, వింజమూరు, ఆత్మకూరు మీదుగా సిరిపురం గోల్డెన్ టెంపుల్ను భక్తులను దర్శనం అనంతరం అరుణాచలం చేరుతుందన్నారు. ఒక్కొక్కరికి 1650 రూపాయలు ఛార్జీ నిర్ణయించామన్నారు.