ఏలూరులోని తంగెళ్ళమూడిలో గంగానమ్మ జాతర మహోత్సవ వేడుకలను శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముడుపులను స్వయంగా శిరస్సుపై ఉంచుకుని గంగానమ్మ అమ్మవారి వద్దకు తీసుకువెళ్లి ముడుపు కట్టే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వేల మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలను చేశారు.