నెల్లూరు చుట్టు పక్కల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రోన్స్ తిరుగుతున్నాయి. వాటి పని ఏమిటంటే మారుమూల ప్రాంతాల్లో పాడుబడిన భవనాల్లో ఎక్కడెక్కడ ఆకతాయిలు తిరుగుతారో వారిని టార్గెట్ చేస్తాయి. ఈ డ్రోన్లు ద్వారా వారు ఏమి చేస్తున్నారు. ఎక్కడ ఉన్నారో పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది. వారు పేకాట ఆడుతున్నారా మద్యం తాగుతున్నారా మరేమైనా చీకటి పనులు చేస్తున్నారా అనేది తెలుస్తోంది.