SKLM: తన దైనందిక జీవితంలో రోజు వారి పనులకు తల్లిదండ్రులపైనే ఈ దివ్యాంగుడు ఆధారపడాల్సిన పరిస్థితి. పొందూరు(M) తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామానికి చెందిన మేకా నవీన్ కుమార్ 100 శాతం దివ్యాంగుడు. సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పింఛన్ రావడం లేదు. అధికారులు, నాయకులు స్పందించి పెన్షన్ మంజూరయ్యేలా చూడాలని కుటుంబీకులు కోరుతున్నారు.