PLD: కష్టాన్ని నమ్ముకుని దేశానికి అన్నం పెడుతున్న పండుగ ఏరువాక పౌర్ణమి అని నరసరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని అరకు దున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రథాలయపరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు.