SKLM: భూ మాతా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా పొందూరు మండల కేంద్రంలో భూసార పరీక్షలు, ఎరువుల వినియోగం పై సోమవారం అవగాహన సదస్సు అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా AO వై. సురేష్ మాట్లాడుతూ.. రసాయన ఎరువుల అధిక వినియోగం భూమి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడటం ద్వారా ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయని వివరించారు.