కోనసీమ: ఐదేళ్ల బాలుడు పాము కాటుతో చనిపోయిన ఘటన ఆత్రేయపురం మండలం ర్యాలీలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జనిపిరెడ్డి మోహన్ నాగ సూర్య మంగళవారం మధ్యాహ్నం సమయంలో పాము కాటుకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలపడంతో ఆత్రేయపురం SI రాము కేసు నమోదు చేసినట్లు తెలిపారు.