EG: కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో పిడుగుపడి పూరీల్లు దగ్ధం అయ్యింది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణంలో పిడుగు పడటంతో గన్నిరెడ్డి నాగరాజు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. ఇంటి యజమానులు వేరే పనిపై ఊరికి వెళ్లడంతో ఈ ప్రమాదం తప్పింది.