కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గురువారం వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ కేసులో వల్లభనేని వంశీ ఏ71 ఉన్నారు. ప్రస్తుతం ఆయన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.