VZM: ఉత్తరాంధ్ర జిల్లాలు జానపద కళలకు పుట్టినిల్లు అని ప్రముఖ ప్రజాకవి, సినీగేయ రచయిత వరంగల్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం స్థానిక కొండపల్లి గ్రాండ్ హోటల్లో గాయని, గాయకుల ఎంపిక జరిగింది. తాను 243 చరణాలతో రచించిన నూరేండ్ల నా వూరు గేయ కావ్యంలో చరణాలను 243 మంది జానపద గాయకులచే పాడించేందుకు ఈ ఎంపికలు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.