ప్రకాశం: పంగులూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశం మందిరం నందు సోమవారం మండలంలోని గ్రామ సర్పంచులకు కార్యదర్శులకు సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీవో స్వరూపరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల సుస్థిరాభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు భాగస్వాములు కావాలని అన్నారు.