AP: కడప కలెక్టరేట్లో విచారణకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి హజరయ్యారు. ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన విచారణలో పాల్గొన్నారు. కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు డిపోల్లో ప్రచారం చేశారంటూ ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. నాలుగు కేసులకు సంబంధించి శాఖాపరమైన విచారణను కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చేశారు.