ASR: షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషన్ విశ్రాంతి ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 17, 18వ తేదీల్లో విశాఖ జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం, వివిధ ఉపకులాల సభ్యులు సంఘాలతో సమావేశమై వినతిపత్రాలు స్వీకరిస్తారనన్నారు. స్వీకరించిన సమస్యలు పరిష్కారం చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.