AP: రాష్ట్ర మంత్రివర్గంలోకి జనసేన నేత నాగబాబును తీసుకుంటున్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజ్ భవన్లో గవర్నర్ చేతులమీదగా నాగబాబు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, నాగబాబు ప్రమాణ స్వీకారానికి CM చంద్రబాబు, DY. CM పవన్ కళ్యాణ్‌తోపాటు ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరవుతాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.