ELR: ఉంగుటూరు మండల పరిషత్ హాలులో ఈ నెల 17, 18వ తేదీలలో సచివాలయ డిజిటల్, ఇంజనీరింగ్, వెల్ఫేర్ సహాయకులకు శిక్షణా తరగతులు జరుగుతాయని ఉంగుటూరు ఎంపీడీవో జిఆర్ మనోజ్ తెలిపారు. ఆ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ తరగతులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్నారు. శిక్షణ తరగతులకు వారు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.