TG: అసెంబ్లీ నిబంధనల మేరకు BAC జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. BACలో BRS నేతలు వ్యవహరించిన తీరు సరిగా లేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నడుపాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారని, పదేళ్లు పాలించిన లీడర్లకు ఈ విషయం కూడా తెలియదా..? హరీష్ రావు చెప్పినట్లు సభ పనిదినాలు ఉండాలంటే ఎలా? అని ఫైర్ అయ్యారు. తాను LOPగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం చేసింది తనకు తెలియదా..? అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.