NDL: సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. నేషనల్ హైవే(NHAI) ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టుల పనుల వేగవంతం, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి అంశాలపై మంత్రి బీసీ టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులతో సమీక్షించారు. పెండింగ్ పనులపై సమీక్షించి మంత్రి దిశా నిర్దేశం చేశారు.