ELR: ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడిగా డాక్టర్ బెజగం శ్రీనివాసు ఎన్నికయ్యారు. ఆదివారం తిరుపతిలో ఆఫీసర్స్ సోషల్ కల్చరల్ క్లబ్ ఆడిటోరియంలో కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఏపీలో అన్ని జిల్లాల నుంచి సభ్యులు హాజరయ్యారు. ఉంగుటూరు మండలం నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడు, ఇంఛార్జ్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.