»A Volunteer Attacked Boy For Not Taking Cigarette
Volunteer వాపు: సిగరెట్లు తేలేదని బాలుడిపై దాడి
ఏపీలో కొందరు వాలంటీర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఒకతను.. బాలుడిని చితక బాదాడు. కారణం ఏంటంటే.. సదరు బాలుడు సిగరెట్ తేలేదని, తన ప్రతాపాన్ని చూపించాడు.
Volunteer Attacked Boy: ఏపీలో వాలంటీర్ల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. రోజుకో చోట.. వాలంటీర్ రెచ్చిపోతూనే ఉన్నాడు. ఒక చోట వృద్దురాలి నగల దొంగతనం, మరో చోట అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ వాలంటీర్ పిల్లాడిపై తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.
వాలంటీర్ల ముసుగులో రెచ్చిపోతున్నారు. బాలికలను మోసం చేస్తున్నారు. ఇటీవల ఓ వృద్దురాలి హతయ కూడా జరిగింది. మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారీ, దాడులు, భూకబ్జాలు, గంజాయి స్మగ్లింగ్, జనం నుంచి డబ్బులు తీసుకొని పారిపోవడం చేశారు. కొన్ని చోట్ల రాత్రి పూట ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీసి నానా రచ్చ చేశారు. నంద్యాల అయితే ఓ యువతి ఫోటోలను అడ్డుపెట్టుకుని వేధించిన విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖలో మరొకరు పదో తరగతి విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించాడు. ఒంటరిగా మహిళలు ఉంటే చాలు.. అంతే సంగతులు.. ఇలా చాలా ఘటనలు చోటుచేసుకున్నాయి. వాలంటీర్లు అంటే ఆహా.. ఓహో అని జగన్ ప్రభుత్వం చెబుతోంది. కానీ రియాల్టీ మాత్రం వేరుగా ఉంది.
సిగరెట్లు తీసుకురాలేదని ఏదో తరగతి విద్యార్ధిని బిల్డింగ్ మీద నుండి తోసేసిన వాలంటీర్
ఈస్ట్ గోదావరి – కోరుకొండ మండలం కణపుర్ గ్రామానికి చెందిన సతీష్ (23) వాలంటీర్‌గా పని చేస్తుండగా అదే గ్రామానికి చెందిన శశిధర్ (13) అనే విద్యార్థిని రోడ్డు మీద వెళ్తుండగా ఆపి సిగరెట్లు తేవాలని… pic.twitter.com/WyMDrj9Z7B
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. కోరుకొండ మండలం కణపుర్ గ్రామానికి చెందిన సతీష్ అనే వాలంటీర్ రెచ్చిపోయాడు. శశిధర్ అనే విద్యార్థిని సిగరేట్లు తీసుకొని రావాలని కోరాడు. అందుకు ఆ బాలుడు నిరాకరించాడు. దీంతో వాలంటీర్ సతీష్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. తనకే సిగరెట్ తీసుకురావా అని ఒంటి కాలిపై లేచాడు. అతనిని కొట్టి, తన్నాడు. ఒకటో అంతస్తు నుంచి తంతే కింద పడిపోయాడు. దీంతో కాలు విరిగింది. చేతు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. ఆ బాలుడు ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఇక స్కూల్ లేదు.. 2 నెలలు విద్యా సంవత్సరం లాస్ అవుతాడు. అందుకు కారణం వాలంటీర్ అని పేరంట్స్ అంటున్నారు.
సిగరెట్ తేవాలా..?
వాలంటీర్ అరాచకం ఏంటీ అనే విమర్శలు వస్తున్నాయి. చదువుకునే బాలుడిని సిగరెట్ తీసుకొని రావాలని కోరడం ఏంటీ అని మండిపడుతున్నారు. ఇదీ కరెక్ట్ కాదని.. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లాడిని గొడ్డును బాదినట్టు బాదుతారా అని విమర్శిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల మరొకరు కూడా ఇలానే తయారయ్యే ప్రమాదం ఉందని.. వెంటనే సదరు వాలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాలంటరీ అంటే.. ఆ 50 ఇళ్లకు మంచి చెడు.. ప్రభుత్వ పథకాలు, పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొందరు ఇలా దిగజారి బిహెవ్ చేస్తున్నారు. ఆ విద్యార్థికి తగిన ఆర్థిక సాయం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.