CTR: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అన్నదాన ట్రస్టుకు దాత విరాళమందించారు. విజయవాడకు చెందిన కళ్యాణ వెంకట గణపతి రూ. లక్ష నగదును విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి.. స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీ పాల్గొన్నారు.