ATP: బొమ్మనహాళ్ మండలం దర్గా హోన్నూరు గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోన్న జూద స్థావరంపై మంగళవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. రూ. 39,500 నగదును స్వాధీనం చేసుకొని ముగ్గురు జూదరులను అరెస్టు చేశారు. మూడు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నబీ రసూల్ తెలిపారు. పారిపోయిన మరికొందరి కోసం గాలిస్తున్నామని అన్నారు.