కృష్ణా: పెనమలూరు(M) పోరంకిలో ముఖాముఖి కార్యక్రమంలో MLA బోడె ప్రసాద్, కలెక్టర్ బాలాజీతో ప్రజా సమస్యలు, పరిష్కారాలపై మంగళవారం చర్చించారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన కాన్సిస్టెన్సీ విజన్ యాక్షన్ యూనిట్స్ ద్వారా వేగవంతమైన సేవలందించాలని సూచించారు. మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లు, మౌలిక వసతులు, ప్రహరీ నిర్మాణం, అమృత్–2లో భూగర్భేతర కుళాయి అంశాలు ప్రస్తావించారు.