KRNL: రాయలసీమ యూనివర్సిటీలో ఫీజులతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కన్వీనర్ రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.6,400కోట్ల బకాయిలు ఉన్నాయని వాటిని విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.