CTR: పుంగనూరు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మోటివేషనల్ తరగతులు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎన్ఎస్పేట ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడు ఎస్. రాజేంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా విద్య ద్వారా జీవితంలో మార్పు సాధ్యమని, కష్టపడి ముందుకెళితే విజయాన్ని తథ్యంగా అందుకోవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు.