తూ.గో జిల్లాలోని రైతులు యూరియా కొరత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. టోకెన్ పొందిన ప్రతి రైతుకు తప్పనిసరిగా యూరియా అందజేస్తామని స్పష్టం చేశారు. బుధవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద రైతు సేవా కేంద్రాల సహాయకులతో సమావేశం నిర్వహించారు. రైతులకు జేసీ నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు యూరియా కేటాయింపు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.