ATP: రాయదుర్గం పట్టణంలో సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. పార్టీ ఆవిర్భవించి నేటికి వందేళ్లు పూర్తయిందని పేర్కొన్నారు. శత జయంతి ఉత్సవంలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.