VZM: తల్లిదండ్రులు భారం కాదని బలమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డా.ఏ.కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. విజయనగరంలోని కుసుమ హరినాథ్ వృద్ధాశ్రమాన్ని సోమవారం సందర్శించి వృద్ధులకు న్యాయ అవగాహన కల్పించారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.