GNTR: నల్లపాడులోని MBTS పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 30న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ, ఆపై చదివిన నిరుద్యోగ యువత దీనికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 6304292828 నంబరును సంప్రదించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.