విశాఖలోని కంచరపాలెం మెట్టు వద్ద ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై కోడి మహేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వెళ్తూ దాడికి పాల్పడ్డాడు. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష చేస్తుండగా అతను ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్‌పై దాడి చేశాడు. ఈ ఘటనపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.