కాకినాడ: ఇంటర్మీడియట్లో ప్రవేశానికి ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ను విడుదల చేసిందని జిల్లా అధికారులు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరంలో (2026–27) మొదటి ఏడాదిలో ప్రవేశానికి అన్ని జూనియర్ కళాశాలల్లో దరఖాస్తులను ఏప్రిల్ 1 నుంచి విక్రయిస్తారు. అదే నెల 6 నుంచి ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 1తో ముగిస్తారని పేర్కొన్నారు.