CTR: రామకుప్పం (M) ననియాల తాండా పరిసర ప్రాంతాల్లో ఏనుగు దాడులు నిత్య కృత్యమవుతున్నాయి. 3రోజులుగా ప్రతి రోజు రాత్రి ఏనుగులు వ్యవసాయ పొలాలపై దాడి చేస్తున్నాయి. వాటిని అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు రైతులు, ఫారెస్ట్ సిబ్బంది నిత్యం ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పంటలకు రుచి మరిగిన ఏనుగులు ఆహారం కోసం వ్యవసాయ పొలాల వైపు వస్తున్నాయి.