NLR: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.