ASR: డుంబ్రిగుడలో ఈనెల 15న సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు మండల ఇంఛార్జ్ ఎంపీడీవో ఎన్.వి.వి నరసింహ మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్న సర్వ సభ్య సమావేశం స్థానిక ఎంపీపీ ఈశ్వరి అధ్యక్షతన జరుగుతుందని పేర్కొన్నారు. మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు ఈ సమావేశానికి హాజరవ్వాలన్నారు.