కోనసీమ: కేరళ తరహా అందాలు ప్రతిబింబించే కోనసీమ పర్యటక రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురంలో శనివారం రాత్రి జరిగిన పోటీలకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో బండారు శ్రీనివాస రావు, ఆకుల రామకృష్ణ తో కలిసి ఆయన పాల్గొని ప్రసంగించారు.