ప్రకాశం: ఒంగోలు నగరంలోని గోపాలనగర్, కమ్మపాలెం, ఇస్లాంపేట, గుంటూరు రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్, క్లౌపేట, క్రిస్టియన్ పాలేల్లో విద్యుత్తుశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 34 బృందాలుగా విద్యుత్తు చౌర్యం, అధిక లోడ్ వినియోగిస్తున్న 363 మందిపై కేసులు నమోదు చేశారు. రూ.17.01 లక్షల అపరాధ రుసుం విధించారు.