NDL: శ్రీశైల క్షేత్రంలో సోమవారం రాత్రి భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వెండి రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అలంకరణలు, గణపతి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో స్వామివారి విహార ఉత్సవం ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.