ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలో శుక్రవారం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 21 మందికి రూ. 20 లక్షలకు పైగా విలువైన చెక్కులను అందించారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తున్నారని అన్నారు.