NDL: శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి యువ ఉత్సవ్-2024 పోటీలను ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపినట్లు ఎంపీ డా.బైరెడ్డి శబరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవం యువతను సాంస్కృతిక, క్రీడలు, విద్యా రంగాలలో తమ ప్రతిభను ప్రదర్శించడానికి అద్భుతమైన వేదికను అందిస్తుంది అని ఎంపీ పేర్కొన్నారు.